ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి : సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ 

ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి : సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ 

సిద్దిపేట రూరల్, వెలుగు: ఓపెన్ స్కూల్ టెన్త్‌‌, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌‌లో పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 20నుంచి 26 వరకు  జరగనున్న ఓపెన్ టెన్స్, ఓపెన్ ఇంటర్ పరీక్షలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

జిల్లాలో ఓపెన్ టెన్త్​కోసం 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో 564 మంది, ఓపెన్ ఇంటర్‌‌‌‌కు 5 ఎగ్జామ్ సెంటర్ల ద్వారా 896 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు చెప్పారు. అనంతరం సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ బాలికల బీసీ హాస్టల్‌‌ను ఆమె సందర్శించారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా అని స్టూడెంట్స్‌‌ను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీఈవో శ్రీనివాస్ రెడ్డి, డీఆర్‌‌‌‌వో నాగరాజమ్మ, అధికారులు పాల్గొన్నారు.